తెలుగుదేశం పార్టీకి కులం, మతం లేదని.. పేదలే తమ కులమని మఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. సోమవారం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదరణ-2 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ ప్రపంచీకరణ కారణంగా చేతి వృత్తులవారు వెనుకబడ్డారని అన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఐవీఆర్ఎస్ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామన్నారు. కాపుల్లో పేదవారిని గుర్తించి సబ్సిడిపై రుణాలు ఇచ్చామని చంద్రబాబు చెప్పారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సలైట్లు అన్యాయంగా చంపారని ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. కిడారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు. మైనారిటీలకు మూడు ప్రధాన శాఖలు ఇచ్చి గౌరవించామని చంద్రబాబు స్పష్టం చేశారు.

0 Comments