ADS

header ads

ధర్మ పోరాట దీక్ష కు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన CBN ఆర్మీ

నెల్లూరు నగరంలో NTR నగర్ లోని శ్రీ వేణుగోపాలస్వామి డిగ్రీ కళాశాల మైదానంలో  జరగనున్న  ధర్మ పోరాట దీక్ష కు మద్దతుగా నెల్లూరు జిల్లా CBN ఆర్మీ ఆధ్వర్యంలో తెలుగు దేశం జిల్లా పార్టీ కార్యాలయం నుండి NTR నగర్ లోని శ్రీ వేణుగోపాలస్వామి డిగ్రీ కళాశాల మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. CBN ఆర్మీ జిల్లా అధ్యక్షుడు చైతన్య కుమార్ లింగారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా  రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  నారా చంద్రబాబు నాయుడు చేపడుతున్న ధర్మ పోరాట దీక్ష కు మద్దతుగా ఈ  భారీ ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీ లో CBN ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ పువ్వాడి,  CBN ఆర్మీ సభ్యులు హాజరత్తు, నాగేంద్ర పగడాల శ్రీకొలను సుదీర్ రెడ్డి వెంకట రమణ, మని దీప్,కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments