స్మార్ట్‌ఫోన్ రంగంలో దూసుకుపోతున్న షియోమి టీవీ మార్కెట్లోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే . చైనాకు చెందిన ఈ మొబైల్స్ తయారీ దారు షియోమి ఎంఐ టీవీ4 సిరీస్‌లో తాజాగా 65 అంగుళాలు 4కె అల్ట్రా హెచ్‌డీ , ఏఐ ఆధారిత ఎంఐ టీవీ4ను చైనాలో విడుదల చేసింది. దీని ధర సుమారు రూ.63,300గా నిర్ణయించింది. అయితే బారత మార్కెట్‌లో ఈ టీవీని ఎప్పుడు లాంచ్ చేసేదీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.
ఫీచర్లు..
స్క్రీన్: 65 అంగుళాలు ర్యామ్: 2జీబీ ఇంటర్నల్ మెమెరీ : 16జీబీ ఆపరేటింగ్ సిస్టమ్ : ప్యాచ్ (ఆండ్రాయిడ్) వీడియో టైప్ : 4కె అల్ట్రా హెచ్‌డీ,డాల్బీ ప్లస్ డీటీఎస్ ధర : రూ.63,300
షియోమి ఎంఐ టీవీ4 ధర మార్కెట్లో రూ. 39,999గా ఉంది. ఫీచర్ల విషయానికొస్తే 4.9 ఎంఎం అల్ట్రా-థిన్ ఫ్రేమ్‌లెస్ డిజైన్,55 అంగుళాల ఎల్‌ఈడీ డిస్‌ప్లే ప్యానెల్, 4కే రెజల్యూషన్ (3840x2160 పిక్సెల్స్) హెచ్‌డీఆర్ సపోర్ట్, 64 బిట్ 1.8 గిగాహెర్జ్ట్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ. ఎంఐ టీవీ 4, ARM Cortex A53 చిప్‌సెట్‌తో కూడిన క్వాడ్ కోర్ ప్రాసెసర్ పై రన్ అవుతుంది. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి, ఈ టీవీలో రెండు యూఎస్బీ పోర్ట్స్‌తో పాటు మూడు హెచ్‌డిఎమ్ఐ పోర్ట్స్ అందుబాటులో ఉంటాయి. వై-ఫైకు సులువుగా కనెక్ట్ అయ్యే విధంగా Ethernet పోర్ట్ ను కూడా ఈ టీవీలో సెటప్ చేయటం జరిగింది. బ్లుటూత్ కనెక్టువిటీని కూడా ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. డాల్బీ సౌండ్ నిమిత్తం రెండు 8వాట్ స్పీకర్లను ఈ టీవీలో షియోమి నిక్షిప్తం చేసింది.

0 Comments