ADS

header ads

రాజమౌళి సినిమా RRR లో ప్రియమణి..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం RRR . ప్రస్తుతం ఈ చిత్ర మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని కోకాపేట లో వేసిన ప్రత్యేక సెట్ లో గత పది రోజులుగా జరుగుతుంది. ఓ భారీ యాక్షన్ పార్ట్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబందించిన మిగతా నటి నటులెవరు అనేది మాత్రం బయటకు రాకుండా రహస్యం గా ఉంచడం తో రకరకాల పేరులు బయట ప్రచారం అవుతున్నాయి.
తాజాగా ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియమణి ఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందనే విషయం తెలియడం లేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ప్రియమణి పెళ్లి చేసుకొని వెండితెర కు దూరం గా ఉంటుంది. అవకాశాలు కూడా రాకపోయేసరికి ఆమె అసలు సినిమాలపై వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ లో ఆమె నటించడం ఏంటి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని ఇలాంటి వార్తలు వినాల్సి వస్తుందో.

Post a Comment

0 Comments