ADS

header ads

సునామి దాటికి 168 మంది మృత్యువాత..

NEWS HUNTER :

*శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో  విరుచుకపడ సునామీ..
*సునామి దాటికి 168కి పెరిగిన మృతుల సంఖ్య, వందల్లో బాధితులు..
*350 పడవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి..

ఇండినేషియాలో సునామీ సృష్టించిన విధ్వంసంలో మృతుల సంఖ్య 168కి చేరింది. 745 మందికి పైగా గాయపడ్డారు. శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో దక్షిణ సుమత్రా, పశ్చిమ జావా బీచ్‌లపై సునామీ విరుచుకపడటంతో  భారీ విధ్వంసం చోటుచేసుకుంది.  ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అలల ధాటికి తీర ప్రాంతంలోని 558కి పైగా భవనాలు ధ్వంసమయ్యాయని, 30 మంది జాడ గల్లంతైందని జాతీయ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ తెలిపింది. 60 రెస్టారెంట్లు, తొమ్మిది హోటళ్లు, 350 పడవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

తాంజుంగ్ లెసుంగ్ బీచ్, లెసుంగ్ బీచ్, తెలుక్ లడ, పనింబాగ్, కరిటా బీచ్‌లోని రెసిడెన్షియల్, టూరిస్టు ప్రాంతాలు సహా కోస్తా ప్రాంతాలు, పండేగ్లాంగ్ జిల్లాలపై సునామీ ప్రభావం తీవ్రంగా ఉన్నట్టు విపత్తు నిర్వహణ సంస్థ అధికార ప్రతినిధి పుర్వో నుర్గోహో వెల్లడించారు. కాగా, అనక్ క్రకటౌ అగ్నిపర్వతం బద్దలైన 24 నిమిషాల తర్వాత సునామీ విరుచుకుపడినట్టు ఇండోనేషియా జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. అగ్నిపర్వతం నుంచి వెలువడిన పదార్ధాలు సముద్రంలో పడటంతో ఉవ్వెత్తున అలలు చేసి బీచ్‌లపై విరుచుకుపడినట్టు తెలిపింది. కాగా, ప్రస్తుతం ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి.

భారీ విలయాన్ని మరవకముందే

ఈ ఏడాది సెప్టెంబర్‌ ఆఖరులో ఇండోనేసియాలోని పాలు నగరంపై భారీ సునామీ విరుచుకుపడడంతో 2,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వేలాది భవనాలు ధ్వంసమయ్యాయి.

2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో సంభవించిన భారీ సునామీ వల్ల ఇండోనేసియా సహా 14 దేశాల్లో 2,28,000 మంది చనిపోయారు.