News Hunter : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన కనిపిస్తుండగా, రానున్న 24 గంటలలో ఇది బలపడి తుఫాన్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు 1350 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారి అలలు ఎగసి పడుతుండగా తుఫాన్ గా మారితే గంటకు 70 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు .లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.

0 Comments