News Hunter:టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని, ఆ డబ్బుతోనే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను కేసీఆర్ పరామర్శించలేదని, టీఆర్‌ఎస్‌ను గద్దె దించాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్‌పై కేసీఆర్ వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శించారు. ప్రజాకూటమి 80 స్థానాల్లో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ 30 సీట్లకే పరిమితమవుతుందని ఉత్తమ్ జోస్యం చెప్పారు.

0 Comments