News Hunter : ఐటీశాఖ అధికారులమని చెప్పి ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక ప్రముఖ రైస్ మిల్లు వ్యాపారిని బురిడీ కోట్టించి సూమారు 4 లక్షల రూపాయలు, 20 లక్షలకు పైగా విలువైన డాక్యుమెంట్లును తీసుకుని పరారైన ఘటన రాజోలు మండలం కూనవరం గ్రామంలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. పోలిసులు, బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం... మండలంలోని కూనవరం గ్రామంలో రుద్ర రామకృష్ణరావు (పెదకాపు) కు చెందిన శ్రీ వేంకటేశ్వర బాయిల్డ్ రైస్ మిల్లు గురువారం రాత్రి ఐదుగురు వ్యక్తులు ఇన్ కామ్ టాక్స్ అధికారులం అని చెప్పి డాక్యుమెంట్లు, లాకర్లు రెండు గంటల పాటు తనిఖీ చేశారని, లాకర్ లో ఉన్న రూ 4 లక్షలు, 20 లక్షలు విలువైన డాక్యుమెంట్లు తీసుకుని వెళ్ళారని, తీరా వాళ్ళు ఎలాంటి రసిదులు ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. దీంతో రాజోలు ఎస్ఐ ఎం.నాగరాజు ఇన్ కామ్ టాక్స్ అధికారులు వచ్చారా లేదా అని తెలుసుకున్నారు. తీరా వచ్చింది అధికారులు కాదని తేలడంతో అందరూ నివ్వెరపోయారు. ఈ సంఘటన అంతా సినీ పక్కిలో కారులో ఐదుగురు వచ్చి డాక్యుమెంట్లు, డబ్బులు పట్టుకుపోవడం జరగడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంబంధిత రైసు మిల్లు యజమాని మిల్లులో అంత డబ్బు ఎందుకు ఉంది, డాక్యుమెంట్లు రైస్ మిల్లులో ఎందుకు ఉంచారు.అనే అంశాలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంఘటన స్థలం కు చేరుకుని పరిశీలించిన రాజోలు ఎస్ఐ నాగరాజు భాదితుని పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

0 Comments