News Hunter : భారత కరెన్సీలోని పెద్ద నోట్లపై నేపాల్‌లో నిషేదం విధించారు. రూ.200, రూ.500, రూ.2000 విలువైన భారత కరెన్సీ నోట్లను వినియోగించరాదంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు కాఠ్‌మాండూ పోస్ట్ వెల్లడించింది. రూ.100 కంటే ఎక్కువ విలువైన భారత కరెన్సీని నేపాల్ ప్రభుత్వం చట్టబద్ధం చేయనందున ఆ నోట్లను ఉపయోగించడం నిషేధంగ అని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి గోకుల్ ప్రసాద్ బస్కోటా చెప్పినట్లు సదరు మీడియా పేర్కొంది. కాగా.. ఈ నిర్ణయం భారత్‌లో పనిచేసే నేపాలీ కూలీలు, ఆ దేశానికి వెళ్లే భారత పర్యాటకులు తీవ్ర ప్రభావం పడనుంది.

0 Comments