ADS

header ads

ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా.. వ్యక్తిగత కారణాల వల్లే

News Hunter : ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి రాజీనామా లేఖను అందజేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్టు ఆయన వెల్లడించారు. తన రాజీనామా వెనుక ఎలాంటి ఒత్తిళ్లూ లేవన్నారు. తక్షణమే ఆర్బీఐ గవర్నర్‌ పదవి నుంచి వైదులుగుతున్నా అని ఆయన ప్రకటించారు. తనకు సహకరించిన సిబ్బంది, ఆర్బీఐ డైరెక్టర్లకు కృతజ్ఞతలు చెప్పారు. తాను పదవి నుంచి దిగిపోతున్నందుకు విచారం వ్యక్తంచేశారు. రిజర్వు బ్యాంకు గవర్నర్‌గా సేవలందించడం గౌరవ ప్రదంగా భావిస్తున్నట్టు తెలిపారు. 2016 నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. ఉర్జిత్‌ హయాంలోనే 2016 నవంబర్‌ 8న ప్రధాని మోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం నోట్ల నద్దుపై ఉర్జిత్‌ పటేల్‌ అన్ని వర్గాల ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ (జేపీసీ) ఎదుట హాజరై పలుమార్లు వివరణ కూడా ఇచ్చుకున్న విషయం తెలిసిందే.

గత కొద్ది కాలంగా ఆర్బీఐకి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న సైలెంట్‌వార్‌ కారణంగానే గత నెల 19న రిజర్వు బ్యాంకు బోర్డు సమావేశం తర్వాత ఆయన రాజీనామా చేస్తారంటూ వార్తలు వెల్లువెత్తాయి. అయితే, కేంద్రం ఉర్జిత్‌, బోర్డులో డైరెక్టర్లతో చర్చలు జరిపిన తర్వాత ఆయన తన ఆలోచనను విరమించుకున్నారని అప్పట్లో ఆర్బీఐ వర్గాలు, కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. ఈ రోజు అకస్మాత్తుగా ఆయన తన రాజీనామా లేఖను కేంద్రానికి పంపడంతో పాటు వ్యక్తిగత కారణాల రీత్యా వైదొలుగుతున్నట్టు పేర్కొన్నారు.

Post a Comment

0 Comments