News Hunter : కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం వలసపల్లె గ్రామానికి చెందిన సుధాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తను కౌలుకు తీసుకొని వేసిన పంట పండకపోవడంతో మనస్తాపం చెంది పురుగులమందు తాగారు. కుటుంబసభ్యులు ప్రొద్దుటూరు ఆసుపత్రి లో చేర్చారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.