ADS

header ads

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి కొత్త బండ్లు..

News Hunter :
హుందా తనంతో కూడిన బైక్‌లను అందిస్తున్న రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ సంస్థ మార్కెట్లోకి రెండు కొత్త బైక్‌లను ఆవిష్కరించింది. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ ఇండియా బిజినెస్‌ హెడ్‌ షాజి కోషి కొత్త ఇంటర్‌సెప్పటర్‌ ఐఎన్‌టీ 650, కాంటినెంటల్‌ జీటీ 650 మోటార్‌ సైకిళ్లను విడుదల చేశారు. వీటి ధరలను సంస్థ రూ.2.50 లక్షల నుంచి రూ.2.85 లక్షలుగా నిర్ణయించింది. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ 250 సీసీ సామర్థ్యం మించిన బైక్‌ల మార్కెట్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ 90 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉందని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఏడాది కాలంలో 100 డీలర్‌షిప్‌లకు విస్తరిస్తామని తెలిపారు.

Post a Comment

0 Comments