News Hunter : సరికొత్త పరిజ్ఞానంతో ఓ ఖాతాదారుడు ఏటీఎం నుంచి విడుతల వారీగా రూ.14.72 లక్షలు కాజేశాడు. ఆలస్యంగా గుర్తించిన బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గోపాలపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్ ఎస్డీ రోడ్డులోని మెడ్ క్వెస్ట్ డయాగ్నస్టిక్ ప్రాంతంలో ఎస్‌బీఐ ఏటీఎం ఉంది. ఈ ఏటీఎంలో రూ.14.72 లక్షలు మాయమయ్యాయి. కొద్ది రోజుల నుంచి ఏటీఎంలో ఉంచిన డబ్బుకు, ఖాతాదారులు డ్రా చేసిన డబ్బుకు తేడా రావడాన్ని బ్యాంక్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ విషయమై ఆరా తీయగా ఓ వ్యక్తి తన ఖాతా నుంచి ఆగస్టు నెల నుంచి నవంబర్ 25వ తేదీ వరకు పలుమార్లు రూ.14.72 లక్షలు డ్రా చేశారు. కానీ అతడి ఖాతా నుంచి ఒక్క రూపాయి కూడా డ్రా కాలేదు. దీంతో బ్యాంకు అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఆ వ్యక్తి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మొత్తం డ్రా చేసినట్లు గుర్తించారు. సదరు వ్యక్తి ఏటీఎం కార్డుతో నగదు డ్రా చేసేందుకు ఏటీఎం మిషన్‌లో కార్డు స్వైప్ చేస్తాడు.
డబ్బు భయటకు వచ్చే సమయంలో తన వద్ద ఉన్న ప్రత్యేక కీ ద్వారా మిషన్ ఆఫ్ చేస్తాడు. అటు తర్వాత ఆ డబ్బును తీసేసుకుంటాడు. డబ్బు పూర్తిగా బయటకు వచ్చాకే నగదు డ్రా అయినట్లు రికార్డు అవుతుంది. కానీ మధ్యలోనే మిషన్ ఆగిపోవడంతో నగదు డ్రా అయినట్లు నమోదు కాలేదు. ఇలా పలుమార్లు ఈ ఏటీఎం నుంచి నగదు స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏటీఎంల గురించి అవగాహణ ఉన్న వారే ఇలా చేయగలుగుతారని, బహుశా గతంలో పనిచేసి మానేసిన వాళ్లే ఇలా చేసి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై బ్యాంక్ మేనేజర్ శోభారాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా నిందితుడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే నిందితుడు కేవలం ఈ ఒక్క ఏటీఎంలో మాత్రమే చేశాడా..? ఇతర బ్యాంకులు, ఇతర ఏటీఎంలలో కూడా ఇలాంటి మోసాలకు పాల్పడి ఉండవచ్చా.. అన్న కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలిసింది.

0 Comments