ADS

header ads

రాముడి పక్కన సీతాదేవి విగ్రహం కూడా పెట్టాలి..?

News Hunter : ఉత్తరప్రదేశ్‌లో శ్రీరాముడి విగ్రహంతో పాటు సీతాదేవి విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నేత కరణ్‌ సింగ్‌ కోరారు. ఈ మేరకు ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాశారు. అయోధ్యలో రాముడి విగ్రహం నిర్మించాలని యోగి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రతిపాదనలో కేవలం రాముడి విగ్రహం మాత్రమే ఉంది. 221 మీటర్ల ఎత్తుతో ఈ విగ్రహాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 151మీటర్ల ఎత్తుతో రాముడి విగ్రహం ఉండగా, పైన 20మీటర్ల ఎత్తుతో గొడుగును నిర్మించాలని అనుకున్నారు. కింద 50మీటర్ల ఎత్తుతో గద్దె ఏర్పాటు చేసి దానిపై విగ్రహం కట్టాలని భావిస్తున్నారు.
అయితే రాముడి పక్కన సీతాదేవి విగ్రహం కూడా ఉండాలని కరణ్‌ సింగ్‌ కోరారు. ఆయన యోగికి రాసిన లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పురాణాల్లో సీతాదేవి ఎదుర్కొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆమె విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే రాముడి విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే.. దాని ప్రతిపాదిత ఎత్తును సగానికి తగ్గించి సీతారాముల ఇద్దరి విగ్రహాలూ అదే స్థలంలో ఏర్పాటు చేయాలని కోరారు.

Post a Comment

0 Comments