News Hunter : డిసెంబర్ 30న రాజమండ్రిలో జరిగే జయహో బీసీ సభకు బీసీలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఆయన కొరకు.స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత మహానుభావుడు ఎన్టీఆర్ దేనని, అధికారంలో ఉన్నా లేకున్నా బీసీలు మాకు అండగాఉన్నారు అని మంత్రి సోమిరెడ్డి చెప్పారు..బీసీలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, ఆదరణ పథకంలో 90 శాతం సబ్సిడీపై పనిముట్లు అందజేస్తున్నామని, బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే సబ్సిడీని, లోను మొత్తాన్ని మూడు, నాలుగు రెట్లు పెంచారని.గత నాలుగున్నరేళ్లలో ఎన్నడూలేని విధంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నమన్నారు. బీసీల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు అమలు చేయడంతో పాటు మిగిలిన పథకాల్లోనూ లబ్ధిదారుల్ని చేరుస్తున్నామని తెలియజేసారు. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.1,500 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఓ వైపు మేం అభివృద్ధి చేస్తుంటే మరోవైపు కొందరు కోర్టులకెళ్లి స్టేలు తెచ్చి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సర్వేపల్లి బిసి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

0 Comments