NEWS HUNTER :
పబ్‌జి మొబైల్ గేమ్‌ను ఆడుతున్న గేమింగ్ ప్రియులకు శుభవార్త. వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వికెండి స్నో మ్యాప్ అప్‌డేట్ ఇప్పుడు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై పబ్‌జి ఆడే యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. ఈ అప్‌డేట్ సైజ్ 134 ఎంబీ ఉంది, గేమ్ ప్లే ఉదయం 5.30 గంటలకు ప్రారంభం అయింది.
ఇక పబ్‌జి గేమ్‌ను ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా (చైనా తప్ప) 200 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ గేమ్‌లో నిత్యం 30 మిలియన్ల మంది డెయిలీ యాక్టివ్ యూజర్లు ఉంటున్నారు. పబ్‌జి మొబైల్‌కు చైనా, భారత మార్కెట్‌లలో మంచి ఆదరణ లభిస్తుందని ఆ గేమ్ డెవలపర్ సంస్థ టెన్సెంట్ గేమ్స్ వెల్లడించింది.
తక్కువ కాన్ఫిగరేషన్ ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ ఈ గేమ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా వస్తుండడం తమకు లాభించిందని, అందుకే చాలా మంది ఈ గేమ్‌ను ఆడుతున్నారని, దీంతో గేమ్‌కు పాపులారిటీ బాగా లభిస్తుందని టెన్సెంట్ గేమ్స్ వెల్లడించింది. ఇక భారత్‌లో పబ్‌జి గేమ్‌ను మొబైల్, పీసీ ప్లాట్‌ఫాంలపై ఎక్కువగా ఆడుతున్నారని కూడా ఆ కంపెనీ తెలిపింది.