ADS

header ads

జల్సాలకు అలవాటు పడి దొంగలు గా మారినా యువకులు అరెస్ట్..

News Hunter : నెల్లూరు జిల్లాలోఇద్దరు ఘరానా దొంగలు అరెస్ట్ వారి వద్ద నుండి 6 బైకులు స్వాధీనం.

నెల్లూరు నగరంలో ఇటీవల వరుస బైకు చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగలను ఇద్దరిని శనివారం బాలాజీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో అనిల్ అనే వ్యక్తి చిల్లకూరు మండలం వాసి కాగా, మోహన్ అనే వ్యక్తి చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి వీళ్లిద్దరూ స్నేహంగా ఉంటూ అన్ని వ్యసనాలకు అలవాటుపడి కష్టపడకుండా సులభ రీతిలో డబ్బు సంపాదించాలన్న దురుద్దేశంతో గత కొంత కాలం నుండి బైక్ చోరీలకు పాల్పడుతున్నారు. వీరి వద్దనుండి ఆరు మోటార్ బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఐదు బైకులు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాగా, ఒక బైకు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ చెందినది. శనివారం నగర డిఎస్పీ మురళీకృష్ణ ఇద్దరు నిందితులను విలేకరుల ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ తల్లిదండ్రుల పర్యవేక్షణ లేనందువల్లే ఇద్దరు నిందితులు దొంగలుగా మారారని తెలిపారు. పిల్లల పట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ చాలా అవసరమన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో సి ఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ ఐ లు రమేష్ బాబు, సిబ్బంది శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.