NEWS HUNTER : ఒక్కరోజులో లక్కుమారి లక్షలు కాదు కోట్లు వచ్చాయి అకౌంట్లోకి. అనుకోకుండా అంత డబ్బు కళ్ల ముందు కనిపించే సరికి ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా నా ఉద్యోగం నేను చేసుకుంటాను. రిటైర్మెంట్ తరువాత ఈ వచ్చిన డబ్బుని వాడతాను అని అమాయకంగా చెబుతోంది వానెస్సా వార్డ్ అనే మహిళ.యూఎస్ మేరీల్యాండ్‌కు చెందిన వానెస్సా కూరగాయలు తీసుకొద్దామని దగ్గరలోని సూపర్ మార్కెట్‌కి వెళ్లింది. క్యాబేజీ కొనుక్కుని వస్తుంటే అక్కడే ఉన్న స్పిన్ వీల్ తన కంట పడింది. విన్ ఏ స్పిన్ స్క్రాచ్ ఆఫ్ టికెట్‌ను కొన్నది. సూపర్ మార్కెట్‌వాళ్లు ఆమెకు ఓ స్క్రాచ్ కార్డు ఇచ్చారు.
అదృష్టం బావుంటే 5 లక్షల డాలర్లు వస్తాయని చెప్పారు. టికెట్ తీసుకుని ఇంటికి వెళ్లి అదే విషయాన్ని తండ్రితో చెప్పింది. సర్లే.. ఇలాంటివన్నీ నమ్మకుంటే మన పని ఖాళీ. ఏదైనా కష్ట పడి పని చేసి డబ్బు సంపాదిస్తేనే ఆనందం ఉంటుందని నాన్న అనేసరికి ఆ స్క్రాచ్ కార్డ్‌ని పైన ర్యాక్‌లో పడేసింది.
అయినా మనకంత అదృష్టం లేదులే అని మనసులో అనుకుని తన పనిలో పడింది. ఫలానా డేట్‌లో వచ్చి స్క్రాచ్ చేయమని చెప్పినందుకు ఆ రోజు కార్డ్ తీసుకుని వెళ్లింది వానెస్సా. ఆశ్చర్యంగా ఆమెకి 2,25,000 డాలర్ల ప్రైజ్ మనీ వచ్చింది. ఇండియన్ కరెన్సీలో 1.5 కోట్ల రూపాయలు వచ్చాయి.
ఇన్ని డబ్బులు ఏం చేస్తావు అమ్మాయి అని పక్కన ఉన్న బామ్మ అడిగేసరికి ముందైతే డిస్నీ వరల్డ్ ట్రిప్‌కి వెళతాను, మిగిలిన డబ్బులు నా రిటైర్మెంట్ తరువాత పనికొస్తాయి బామ్మా అని ఆనందంగా చెప్పింది.

0 Comments