NEWS HUNTER : ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర వైఖరికి నిరసనగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పార్లమెంటు ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం దీక్ష చేపట్టాలని ఎంపీ నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం గాంధీ విగ్రహం వద్ద దీక్షకు దిగారు. పార్లమెంటు ముగిసే వరకు ఆయన దీక్ష కొనసాగనుంది. రామ్మోహన్ నాయుడు నిరసనకు మద్దతుగా టీడీపీ ఎంపీలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ మాట్లాడుతూ విశాఖ రైల్వేజోన్‌పై కేంద్రం సమాధానం చెప్పాలన్నారు. ‘నా పుట్టినరోజు సందర్భంగా మోదీ ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’ అని ఎంపీ రామ్మోహన్‌నాయుడు డిమాండ్ చేశారు.
