News Hunter : నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లోని వినాయక గుడి వద్ద ఎపియస్ ఆర్టీసీ బస్సు క్రిందపడి మహిళ మృతి. వివరాలలోకి వెళితే.. సంతవేలూరు కు చెందిన కుప్పని కవిత బస్సు లోనుండి దిగుతుండగా కాలుజారి బస్సు క్రింద పడిందని స్థానికులు తెలియజేశారు.గాయపడిన మహిళ ను 108 సహాయం తో ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినది. ఆమె సూళ్లూరుపేటలోని నారాయణ స్కూలు లో తెలుగు టీచర్ గా పనివేస్తుంది.
