News Hunter : బడి గంట కొట్టారు త్వరగా స్కూల్‌కి వెళ్లమని.. అమ్మ నెత్తీనోరు బాదుకుంటున్నా వినరు చిన్నారులు. స్కూల్‌కి వెళ్లనని తెగ మారాం చేస్తారు. అమ్మ బతిమాలి.. బామాలి.. బుజ్జగించి.. చివరకు చాకెట్లు ఆశ చూపిస్తే.. అప్పుడు అతి కష్టమీద బడి బాట పడుతుంటారు. నర్సరీ నుంచి ఏడవ తరగతి వరకు చదువుకునే చిన్నారుల పరిస్థితి దాదాపు ఇలానే ఉంటుంది. స్కూల్ వెళ్లటమే కష్టంగా భావించే పిల్లాడు.. ఏకంగా ఓ స్కూల్ పెట్టేసి.. పాఠాలు చెబుతె ఎలా ఉంటుంది. ఆశ్చర్యంగా ఉంటుంది కదా! ఇలాంటి ఘటనే అర్జెంటీనాలో జరిగింది. లియోనార్డో నికనార్ క్వింటెరాస్ అనే పన్నెండేళ్ల పిల్లవాడు చదువుకునే వయసులోనే టీచర్ అయ్యాడు.
సెవెన్త్ క్లాసు చదువుతున్న లియో.. చదువుకునే వయస్సులో స్కూల్‌కి వెళ్లకుండా ఉండే పిల్లల గురించి ఆలోచించేవాడు. చదువుకోవటానికి స్థోమత లేని పేద పిల్లల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు. అంతే వెంటనే తన ఆలోచనకి కార్యరూపం దాల్చాడు. యూనియన్ అండ్ హోమ్‌లాండ్ అనే పేరుతో ఓ స్కూల్‌ని స్టార్ చేశాడు. చిన్న వయస్సులో ఎంతో పెద్ద మనసుతో ఆలోచించిన ఆ పిల్లాడికి కుటుంబ సభ్యులు అండగా నిలిచారు. వారి సాయంతో ఇంటికి దగ్గర్లోనే చిన్న రూమ్‌ల్లాంటివి ఏర్పాటు చేసి, కుర్చీలు, టేబుల్, స్కూల్ బెల్, బ్లాక్‌బోర్డ్, నోట్స్.. ఇలా స్కూల్లో ఉండే సదుపాయాలన్నీ ఏర్పాటు చేసుకున్నాడు.
ఈ స్కూల్లో నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు ఉంది. లియో ఒక్కడే అన్ని క్లాసులకూ వెళ్లి పాఠాలు చెప్పేస్తుంటాడు. తనే పాఠాలు చెబుతున్నాడు కదా అని స్కూల్‌కి వెళ్లడం మాత్రం మానడు. అందరి స్టూడెంట్స్‌లాగే స్కూల్‌కు వెళ్లిపోతాడు. మిగిలిన టైంలో క్లాసులు చెబుతాడు. ఇంకా లియోకి సెలవు ఉన్న రోజుల్లో కూడా తను బోధించే స్కూల్ మాత్రం తెరిచే ఉంటుంది. తను నేర్చుకుంటూ నలుగురికి విద్యను బోధిస్తున్న లియోని చూసి అందరు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.