News Hunter : ఏపీ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా ప్రవీణ్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. 1961లో జన్మించిన ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ లిటిల్ ఫ్లవర్ స్కూల్‌లో చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో లా చదివారు. 1986లో న్యాయవాద వృత్తి స్వీకరించారు. క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తూనే ఆయన 2012లో ఏపీ హైకోర్టులో అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. 2013లో పూర్తి స్థాయి న్యాయమూర్తి అయ్యారు. ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న రాధాకృష్ణన్ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా కొనసాగుతారు.
