News Hunter : ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్నకూతుర్నే కడతేర్చాడు ఓ తండ్రి. మంచిర్యాల జిల్లా జన్నారంలో ఈ విషాదం చోటు చేసుకుంది. పరువు కోసం కన్నబిడ్డ జీవితాన్నే నాశనం చేసిన కసాయితండ్రి. జిన్నారం మండలం కలమడుగు గ్రామానికి చెందిన అనురాధ ఈ నెల3న ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ వివాహం ఆమె తల్లి దండ్రులకు ఇష్టం లేదు. దీంతో కూతుర్ని కిరాతకంగా హత్య చేశారు. ఆనవాళ్లు దొరక్కుండా మృతదేహాన్ని బూడిద చేశారు.
