News Hunter : జేబులో ఫోన్లు పేలిపోతున్నాయి. ఇంట్లో ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు పేలిపోతున్నాయి. స్విచ్ వేసి రన్నింగ్‌లో ఉంటే పేలడం కూడా కాదు. ఆఫ్ చేసి ఉన్న వాషింగ్ మెషీన్ పేలింది జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన ఫిక్కామోడ్ నివాసి రాజేష్ కుమార్ ఇంట్లో. బాత్రూమ్‌లో ఉంచిన వాషింగ్ మెషిన్ ఉన్నట్టుండి పేలిపోయింది.
దీంతో బాత్రూమ్ గోడలు బీటలువారాయి. తలుపు కూడా కొంత మేర కాలిపోయింది. అయితే పేలుడు జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్విచ్ ఆఫ్ చేసినా వాషింగ్ మిషన్ ఎలా పేలిందో తెలియట్లేదంటూ రాజేష్ సదరు కంపెనీకి ఫిర్యాదు చేశాడు.

0 Comments