ADS

header ads

ఆస్తికోసం సొంత అక్కనే హత్య చేసిన తమ్ముడు

News Hunter : మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఆస్తికోసం సొంత అక్కనే హతమార్చాడు ఓ తమ్ముడు. హైదరాబాద్ మలక్ పేట పోలీస్టేషన్ పరిధిలోని ఈస్ట్ ప్రశాంత్ నగర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది.
ఆస్తికోసం అక్కను మూడు రోజుల క్రితం హత్య చేసిన ఓ తమ్ముడు ఆమె మృతదేహాన్ని బాత్‌రూమ్లో పడేశాడు. ఏమీ తెలియనట్టు బుధవారం సాయంత్రం మలక్‌పేట పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి నిజం ఒప్పుకున్నాడు.డెడ్ బాడీని పోలీసులు పోస్ట్‌మార్టం నిమత్తం ఉస్మానియా హాస్పటల్ కి తరలించారు.