News Hunter : నెల్లూరులో మంత్రి నారాయణ విస్తృత పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు లోని ఎన్టీఆర్ నగర్ లో నగర దర్శని కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నగరంలో రోడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో టీడీపీ ప్రభుత్వం సాధించిందన్నారు. సీఎం కృషి వల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి ఉపాధికి పెద్దపీట వేశామని, ఇండియా స్కిల్ -2019 సమీక్షలో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానం లో ఉందన్నారు.మార్చి 31 నాటికి నెల్లూరులో అన్ని అభివృద్ధి పనులు పూర్తవుతాయి అని తెలియ జేశారు.రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షం లేదని విమర్శించారు. త్వరలో ప్రధాని మోదీ నియంతృత్వానికి ప్రజలు స్వస్తి పలుకుతారని నారాయణ చెప్పారు.
