News Hunter : తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇక మిగిలింది ఓటరు తీర్పు మాత్రమే. మరోసారి తెరాస అధికారంలోకి వచ్చినట్టేయితే.. మరోసారి కేసీఆర్ సీఎం అవుతారు. అలా జరగకుండా కాంగ్రెస్ సారధ్యంలోని ప్రజా కూటమి అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పోటీలో దాదాపు 20మందికిపై కాంగ్రెస్ నేతలు ఉన్నట్టు కనబడుతోంది. తాజాగా, తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు.
ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరనే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పడం తొందరపాటు అవుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లిన కేసీఆర్ ను ఓడించడమే తమ ప్రథమ లక్ష్యం.ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం ఎవరనే విషయంపై చర్చిస్తామని రాహుల్ తెలిపారు.
మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి రేవంత్ రెడ్డి అనే హింట్ ఇచ్చారు ఆ పార్టీ సీనియర్ నేత గులాంనభి ఆజాద్. ఆయన ఇవాళ రేవంత్ ని పరామర్శించేందుకు కొడంగల్ వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆజాద్.. ఇవాళ తెలంగాణ సీఎం గా కేసీఆర్ ఉండొచ్చు. రేపు ఆసీటులోకి రేవంత్ రావొచ్చని తెలిపారు.

0 Comments