News Hunter : డాటాబేస్ సంస్థ ఐఎండీబీ (ఇంటర్నెట్ మేనేజ్ మెంట్ డాటాబేస్) తాజాగా 2018 కి గాను ఇండియాలో టాప్ టెన్ మూవీస్ లిస్ట్‌విడుదల చేసింది . ఇందులో టాలీవుడ్ నుండి మహానటి (4), రంగస్థలం(7) స్థానాల్లో చోటు సంపాందించాయి. మహానటి చిత్రం అభినవ నేత్రి సావిత్రి జీవిత నేపథ్యంలో తెరకెక్కగా ఇందులో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించారు. సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ కీలక పాత్రలలో కనిపించారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తరువాత అత్యదిక వసూళ్లను సాధించిన రెండవ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ చిత్రం. రామ్ చరణ్, సమంత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనసూయ, ప్రకాశ్ రాజ్,జగపతి బాబు, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలలో కనిపించారు.
ఐఎండిబి 2018 టాప్ 10 లో చోటు సంపాదించిన చిత్రాలు :
1. అంధాదున్ (హిందీ )
2. రట్సాసన్ (తమిళం )
3. 96 (తమిళం )
4. మహానటి (తెలుగు)
5. బడాయి హో (హిందీ)
6. ప్యాడ్ మ్యాన్ (హిందీ)
7. రంగస్థలం (తెలుగు)
8. స్ట్రీ (హిందీ)
9. రాజీ (హిందీ)
10. సంజు (హిందీ)

0 Comments