ADS

header ads

రోడ్డు మీద కరెన్సీ నోట్ల వరద.. ఏరుకున్న వాళ్లకు ఎరుకున్నంతా..

News Hunter : ఏటీఎంలకు నగదు సరఫరా చేసే బ్రింక్స్ వ్యాను వెనుక తలుపు అనుకోకండా తెరుచుకోవడంతో రోడ్డు మీద కరెన్సీనోట్లు వరదలెత్తాయి ఎవరు మాత్రం ఊరుకుంటారు? జాక్‌పాట్ కొట్టేశామని సంబరపడి ఏరుకున్నవారికి ఏరుకున్నంతా అన్నట్టు జనం పెద్దపెట్టున ఎగబడ్డారు. కార్లు ఎక్కడపడితే అక్కడ ఆపి నోట్లవేటలో పడ్డారు. దీనివల్ల ట్రాఫిక్ జాం ఏర్పడింది. కొన్నివాహనాలు అదుపుతప్పి ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. అమెరికాలోని న్యూజెర్సీ హైవేపై ఈ ఘటన జరిగింది. అనేకమంది ఈ ఘటనపై ట్విట్టర్‌లో వీడియోలు కూడా పెట్టారు. నోట్లు గాలిలో ఎగురుతుంటే జనం చిన్న పిల్లల్లా వాటివెంబడి పడడం అందులో కనిపించింది. కొందరు నోట్లు కుక్కేందుకు ప్లాస్టిక్ కవర్లు కూడా ఉపయోగించారు. ఆ సమయంలో మంచు కురుస్తున్నది. మంచుతోపాటు నోట్లు గాలిలో తేలడంతో ఓ నెటిజనుడు డబ్బువర్షం కురిసిందని ట్విట్టర్‌లో జోక్ చేశాడు. బ్రింక్స్ వ్యానులో నుంచి రెండు బ్యాగులు కిందపడిపోయి నోట్లు బయటకు వచ్చాయి. ఒకదాంట్లో 3.7 లక్షలు, మరోదాంట్లో 1.4 లక్షలు.. మొత్తం 5.1 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.37 లక్షలు) ఉన్నట్టు బ్యాంకు అధికారులు చెప్పారు. బ్రింక్స్ సిబ్బంది, దారినపోయేవారు కలిసి సుమారు 2 లక్షల డాలర్లు అక్కడికక్కడే సేకరించారు. చాలామంది డబ్బు ఇండ్లకు పట్టుకుపోగా కొందరు మాత్రం నిజాయితీగా ఈస్ట్ రూథర్‌ఫర్డ్ పోలీసు స్టేషన్‌కు వచ్చి తమకు రోడ్డుమీద దొరికిన నగదును అప్పగించారు. అలా తెచ్చి ఇచ్చిన డబ్బు కేవలం 11 వేల డాలర్లేనట. అంటే సగం కంటే తక్కువ మిగిలిన సొమ్ము గాలికిపోయే డాలరు జనార్పణం అన్నట్టుగా తయారైంది. అయినా డబ్బంటే ఎవరికి మాత్రం చేదు?

Post a Comment

0 Comments