ADS

header ads

భయంకరమైన చెడ్డి గ్యాంగ్‌‌ను అరెస్ట్ చేసిన విశాఖ పోలీసులు

New Hunter : తెలుగు రాష్ట్రాల ప్రజలను దోపిడీలతో హడలెత్తించిన మోస్ట్‌ వాంటెండ్‌ చెడ్డి గ్యాంగ్‌‌ను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. చెడ్డి గ్యాంగ్‌లో ముగ్గురిని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ గ్యాంగ్ 2010 నుంచి చోరీలకు పాల్పడుతోందని, రాత్రి సమయాల్లో 20 చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు చెప్పారు. విశాఖ, నెల్లూరు, తిరుపతి సహా తెలంగాణ, తమిళనాడులోనూ చోరీలకు తెగబడ్డారు. పట్టుబడిన చెడ్డీ గ్యాంగ్ నుంచి 400 గ్రాముల వెండి, ఒక ఐరన్‌ రాడ్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.