ADS

header ads

కోల్ కత్తా మెట్రోలో అగ్నిప్రమాదం...

News Hunter : కోల్ కత్తా మెట్రో రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. రవీంద్ర సదన్, మైదాన్ రైల్వే స్టేషన్ మధ్య రైలు భూగర్భ సొరంగంలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రైలు కిటికీలు పగులగొట్టి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే బెంగాల్ ఫైర్ సర్వీస్, కోల్ కత్తా పోలీసు డిజాస్టర్ మేనేజ్ మెంట్ గ్రూప్ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో చాలా మంది పొగతో ఊపిరి ఆడక ఇబ్బంది పడ్డారు. 11 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కోల్ కత్తా మెట్రో సర్వీసులను తాత్కాలికంగా ఆపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.