ADS

header ads

ప్రియా ప్రకాశ్ కు ఆక్సిడెంట్..తలకు కుట్లు..?

News Hunter : ఒక్క కన్నుగీటుతో రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా సన్సేషన్‌గా మారిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌..తాజాగా షూటింగ్ స్పాట్ లో ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ భామ సంతోష్ శివన్ డైరెక్షన్‌లో 'జాక్ అండ్ జిల్' అనే సినిమా లో నటిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నపుడు మంజు వారియర్ తలకుబలమైన గాయమైందట.
వెంటనే చిత్ర యూనిట్ ఆమెను ఆసుపత్రికి తరలించగా ఆమె తలకు కుట్లు వేసారట డాక్టర్స్.కొన్ని రోజుల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్స్ చెప్పడం తో , ప్రియా ప్రకాశ్ వారియర్ పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ మూవీ షూటింగ్ తిరిగి మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఈ మూవీలో ప్రియా ప్రకాశ్ వారియర్ జోడిగా జయరామ్ హీరోగా నటిస్తున్నాడు.
ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. కేవలం ఒక కను సైగ చేసి రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది ఈ మలయాళ భామ.'ఒరు ఆదార్ లవ్' సినిమాలో మాణిక్య మలరాయ సాంగ్‌లో కన్నుగొట్టి, చేతులతో గన్ను పేల్చి యూత్ హార్ట్స్‌ను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈమెకు వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి.

Post a Comment

0 Comments