News Hunter :
మీ పిల్లలకు ఆధార్ లేదా..!
స్కూల్లో జాయిన్ చేయాలి అంటే ఆధార్ కావాలని ఆలోచిస్తున్నారా...!
ఇక నుండి ఆధార్ లేకుండానే స్కూల్లో జాయిన్ కావొచ్చు, వచ్చే సంవత్సరాని సంబంధించి పాఠశాలలో ఆడ్మిషన్లు దాదాపు ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాలలో ఆడ్మిషన్ పొందాలంటే సదరు విద్యార్థులు ఆధార్ సమర్పించాల్సిన అవసరం లేదని, స్కూల్ యాజమాన్యాలు సైతం విద్యార్థులను ఆడగవద్దని భారత విశిష్ట గుర్తింపు ప్రాథికార సంస్థ (యూఐడీఏఐ) సూచించింది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. పాఠశాల అడ్మిషన్లతో సహా చిన్నారులకు కల్పించే ప్రతి సౌకర్యానికి ఆధార్ సమర్పించాలని కోరడం సరైంది కాదుగ అని యూఐడీఏఐ సీఈవో అజయ్ భూషణ్ పాండే తెలిపారు. ఆధార్ సమర్పించలేదని ఏ పాఠశాల యాజమాన్యం కూడా అడ్మిషన్‌ను తిరస్కరించరాదని హెచ్చరించారు.
