ADS

header ads

ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తే అండర్ వేర్‌ వచ్చింది..

News Hunter : రానురాను ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థల ప్రవర్తన వెకిలిగా మారుతోంది. ఒకచోటేమో ఆకలేసి ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఇటుక రాయి వచ్చింది. మరోచోట పార్సిల్ ను తినేసి కస్టమర్ ను ఎండగట్టాడో బాయ్.. తాజాగా అమెరికాలోని ఓ రెస్టారెంట్ చేసిన పనికి ఫేమస్ ఫుడ్ డెలివరీ సంస్థ నవ్వులపాలైంది. ఆకలితో ఉన్న ఓ వ్యక్తి ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాడు. ఒక అరగంట తరువాత పార్సిల్ రానే వచ్చింది.
ఆకలికి నకనకలాడుతూ.. ఆ పార్సిల్ ను ఆశగా తెరిచి చూశాడు. కానీ అందులో ఫ్రైడ్ రైస్ ఉండాల్సిన ప్యాకెట్‌లో అండర్ వేర్‌ వచ్చింది. దాంతో అవాక్కయిన సదరు వ్యక్తి వెంటనే ఫుడ్ డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై స్పందించిన ఆ ఫుడ్ డెలివరీ సంస్థ ఆ కస్టమర్‌కు డబ్బు రిఫండ్ చేసింది. అలాగే ఫుడ్ డెలివరీ చేసే రెస్టారెంట్ తో ఉన్న ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంది.

Post a Comment

0 Comments