ADS

header ads

ఆంధ్రా బ్యాంకు ఖాతాదారులూ ఈఎంవీ కార్డులు తెచ్చుకోండి

News Hunter : జనవరి ఒకటి తర్వాత ప్రస్తుతం ఉన్న మ్యాగ్నెటిక్‌ స్ర్టిప్‌ కార్డులు పని చేయవని, ఖాతాదారులు తమకు ఖాతా ఉన్న శాఖకు వెళ్లి ఈఎంవీ చిప్‌ కార్డులు తెచ్చుకోవాలని ఆంధ్రా బ్యాంకు పేర్కొంది. మ్యాగ్నెటిక్‌ స్ర్టిప్‌ కార్డుల స్థానంలో ఖాతాదారులందరికీ ఉచితంగా చిప్‌ కార్డులు ఇస్తున్నట్లు తెలిపింది. అన్ని శాఖల్లో తగినన్ని ఈవీఎం చిప్‌ డెబిట్‌ కార్డులు ఉన్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. పాత కార్డులతో పోలిస్తే చిప్‌ కార్డుల్లో భద్రత ఫీచర్లు మెరుగ్గా ఉంటాయి. ఖాతాదారులు భద్రంగా ఆన్‌లైన్‌ లావాదేవీలు చేసుకోవచ్చు.