News Hunter :ఫోన్‌పే యాప్ ద్వారా ఇతరుల బ్యాంక్ ఖాతా నుంచి తన ఖాతాలో డబ్బులు జమ కాగా.. ఆ నగదును తిరిగి ఆ వ్యక్తికే ఇచ్చి తన నిజాయతీని చాటుకున్నాడు ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు రవీందర్. నగరంలోని అబిడ్స్‌కు చెందిన ఓరుగంటి నవీన్ ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సహాయ ఆచార్యుడిగా పని చేస్తున్నాడు. డబ్బులు అవసరమై తన సోదరుడు రాజేష్‌ను అడిగాడు. ఈనెల 7న రాజేష్ తన చరవాణిలోని ఫోన్‌పే యాప్ ద్వారా రూ.47వేలను నవీన్ ఖాతాకు బదిలీ చేశాడు. ఆ డబ్బులు నవీన్ ఖాతాలో జమ కాలేదు. కంగారుపడిన నవీన్ ఫోన్‌పే యాప్‌లో విచారణ చేయగా తనకు రావాల్సిన డబ్బులు మహేశ్వరం మండలం అమీర్‌పేటకు చెందిన రవీందర్ ఖాతాలో జమైనట్లు తెలుసుకున్నాడు. శనివారం బ్యాంకు అధికారులు రవీందర్‌కు విషయం చెప్పగా.. అతను తన ఖాతాలో జమైన రూ. 47వేల నగదును నవీన్ కుటుంబ సభ్యులకు అందజేశారు.

0 Comments