ADS

header ads

హీరోయిన్ హన్సిక మీద కేసు నమోదు

NEWS HUNTER : హీరోయిన్ హన్సిక మీద తమిళనాడులో కేసు నమోదైంది. హన్సిక నటిస్తున్న కోలీవుడ్ మూవీ 'మహా' పోస్టర్ వివాదాస్పదంగా ఉండటమే అందుకు కారణం. దీంతో పిఎంకె లీడర్ జానకి రామన్ హన్సికతో పాటు దర్శకుడు జమీల్ మీద కోర్టులో కేసు వేశారు.
       'మహా' మూవీలో రుద్రాక్షమాల ధరించిన హన్సిక పొగ త్రాగుతున్నట్లు చూపించడంపై జానకిరామన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ పోస్టర్ ఉందని ఆయన ఆరోపించారు. వారిపై తగిన చర్యలు తీసుకోవాలని తన పిటీషన్లో కోరారు. అయితే చిత్ర బందం మాత్రం అఘోరాలను ఇన్స్‌స్పిరేషన్‌గా తీసుకుని ఈ పోస్టర్ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. అయితే ఈ కేసుపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.

Post a Comment

0 Comments