News Hunter : నెల్లూరు జిల్లాలో పట్టపగలే దారుణం జరిగింది. జిఎస్ రాయల్ సెంటర్ దగ్గర కూతురి పై తండ్రి కత్తితో దాడి చేశాడు. కూతురు కులాంతర వివాహం చేసుకుందని తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది. పట్టపగలే దారుణం జరగడంతో అంతా షాకయ్యారు.
నెల్లూరు పట్టణానికి చెందిన దేవయాని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. అది నచ్చని అమ్మాయి కుటుంబ సభ్యులు కోపంగా ఉన్నారు. దేవయాని శుక్రవారం మధ్యాహ్నం జిఎస్ రాయల్ సెంటర్ దగ్గరకు రాగా దేవయాని తండ్రి ఆమె పై కత్తితో దాడి చేశాడు. కత్తితో తలకాయ, మెడ భాగాల పై బలంగా దాడి చేశాడు. ఇంతలోనే ఘోరాన్ని అడ్డుకోవడానికి స్థానికులు ముందుకు వచ్చారు. దీంతో దేవయాని తండ్రి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చి ఆమెను నెల్లూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం దేవయాని పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు నెల్లూరులోని ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు.