News Hunter : అమరావతిలో ఐటీ కంపెనీలు ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రపంచంలో అన్ని చోట్ల భారతీయ ఐటీ నిపుణులున్నారని, ఐటీ నిపుణుల్లో ఎక్కువ మంది రాష్ట్రానికి చెందిన వారేనన్నారు. విభజనకు ముందు ఐటీ అంతా హైదరాబాద్‌కే పరిమితమైందని, నవ్యాంద్రలో ఐటీ కంపెనీలు ఏర్పాటుకు ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. పెద్ద, చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో 35 వేల మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించామని, హెచ్‌సీఎల్ లాంటి గొప్ప సంస్థలు రాష్ట్రానికి వచ్చాయని ఆయన తెలిపారు. గన్నవరం మేథాటవర్స్‌లో రెండో దశ త్వరలో ప్రారంభిస్తామని, తాత్కాలిక భవనాల్లో 9 ఐటీ కంపెనీలలను తరలించ్చామని చెప్పారు. కంపెనీలకు ఆకర్షణీయంగా రాయితీలు కల్పిస్తున్నామని, యువనేస్తం కింద భృతితో పాటు శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. టీసీఎల్ కంపెనీ తిరుపతిలో ఏర్పాటు చేస్తామని, రాష్ట్రానికి మరో ఎలక్ట్రానిక్ కంపెనీలు రాబోతుందని లోకేష్ వెల్లడించారు.
