News Hunter : ఏపీ ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించింది. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో సాంకేతిక సహకారంతో జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించారు. ప్రాథమికంగా రాష్ట్రం మొత్తం మీద 25లక్షల 47వేల 019 ఓట్లపై సందేహాలు తలెత్తాయి. ERO డాట్ నెట్‌లో ఓటర్ల జాబితాను పూర్తి స్థాయిలో పరిశీలించిన ఎన్నికల సంఘం 20లక్షల 65వేల 032 ఓట్లను సక్రమంగా ఉన్నాయని తేల్చింది. ఓటర్ల జాబితాలో ఓటరు పేరు.., ఇంటి నంబరు., లింగ భేదం., వయసుతో పాటు ఫోటోలను క్షుణ్ణంగా పరిశీలించి జాబితాను సరిచేశారు. దీంతో పాటు బూత్ లెవల్ ఆఫీసర్లు క్షేత్ర స్థాయిలో పరిశీలించి లక్షా 28వేల 840 ఓట్లను తొలగించారు. తొలగించిన ఓట్లలో చనిపోయినవారు 38వేల 331, వలసపోయినవారు 54వేల 516 ఓట్లు, డూప్లికేట్ ఓట్లు 31వేల 158 మంది ఉన్నాయి. పేర్లలో తప్పులు, ఇంటి పేర్ల సవరణలు చేయాల్సిన వాటిని 3లక్షల 52వేల 383గా తేల్చారు. మరో 764 ఓట్ల పరిశీలన చేయాల్సి ఉందన్నారు అధికారులు.
జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళంలో 5వేల 618, విజయనగరం జిల్లాలో 4వేల 776. విశాఖపట్నంలో 14 వేల 05, తూర్పు గోదావరి జిల్లాలో 17 వేల 059, పశ్ఛిమ గోదావరిలో 5 వేల 292., కృష్ణా జిల్లాలో 7 వేల 014., గుంటూరు జిల్లాలో 10 వేల 496., ప్రకాశం జిల్లాలో 6వేల 536., నెల్లూరు జిల్లాలో 12 వేల 005. ,కడప జిల్లాలో 5 వేల 578., కర్నూలు జిల్లాలో 11 వేల 799., అనంతపురం జిల్లాలో 11 వేల155. చిత్తూరు జిల్లాలో 16 వేల 607 ఓట్లను తొలగించారు. ఓట్ల తొలగింపులో తూర్పు గోదావరి జిల్లా 17వేల 59 ఓట్లతో ప్రథమస్థానంలో ఉంది. సాధ్యమైనంత త్వరగా తుది పరిశీలన జరిపి జాబితా ముద్రిస్తామన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ ప్రక్రియ ను చేపట్టింది.సీఈఓ ఆంధ్ర వెబ్ సైట్ లో మీ పేరు ఉందొ లేదో చెక్ చేసుకోండి. లేని చొ nvsp.in లో అప్లై చేసుకోండి. లేదా మీ దగ్గరలోని ఎం ఆర్ ఓ కార్యాలయం లో గాని, ఓటర్ నమోదు కార్యాలయం లో సంప్రదించండి.