News Hunter : హైస్కూల్ ఏజ్ లోనే ఎనిమిదో తరగతి పిల్లవాడు దారితప్పాడు. బరితెగించి అమ్మాయిలను నగ్నంగా వీడియో తీసి బుక్కైపోయాడు. హైదరాబాద్ మాదాపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే మాదాపూర్ ఉమెన్ హాస్టల్ పక్కనే బాలుడి ఇల్లు ఉంది. యువతులు స్నానం చేస్తున్న సమయంలో సెల్ ఫోన్ లో వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందేవాడు. దాదాపు ముప్పై మంది యువతులను వీడియో తీశాడు. తరచూ సెల్ ఫోన్ తో బాత్రూం వైపు తచ్చాడుతుండటంతో అనుమానం వచ్చిన యువతులు విషయం పసిగట్టారు. అతనిపై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మైనర్ బాలుడి భాగోతం బయటపడింది.
