News Hunter : ఉపాధి కల్పిస్తానని నమ్మించి ఇద్దరు అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపాడో వ్యక్తి. అతడి చెర నుంచి తప్పించుకున్న ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో అతను అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాద్ హకీంహిల్స్‌లో నివసించే సర్పరాజ్‌ఖాన్(27) కొన్ని రోజుల క్రితం బంగ్లాదేశ్‌లో తనకు తెలిసిన వ్యక్తి ద్వారా ఇద్దరు యువతులను ఇండియాకు రప్పించాడు. ఎవరికీ అనుమానం రాకుండా సముద్ర మార్గం ద్వారా వారిని ముందుగా కోల్ కత్తాకు రప్పించి.. ఆ తరువాత హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. రాజేంద్రనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.
అక్కడ ఆ ఇద్దరి యువతులతో కొంతకాలంగా వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. అయితే అందులో ఓ యువతి అతడిని ప్రశ్నించింది. తమకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇలా వ్యభిచార కూపంలోకి దింపుతారా అని ఎదురుతిరిగింది. దాంతో ఆమెనుచిత్రహింసలకు గురిచేసాడతను. చాకచక్యంగా అతడి బారినుంచి తప్పించుకున్న బాధితురాలు రాజేంద్రనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సర్పరాజ్‌ఖాన్ ఇంటిపై దాడిచేసి.. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు యువతుల్లో ఒకరినే పోలీసులు గుర్తించారు. ఆమెను కాచిగూడలోని బాలికల సదనానికి పంపించారు.