ADS

header ads

రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా సైనా నెహ్వాల్....

News Hunter(హైదరాబాద్) :  స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ శుక్రవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గచ్చిబౌలిలో సైనా, కశ్యప్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం చేసుకున్నారు. బెస్ట్ మ్యాచ్ ఆఫ్ మై లైఫ్‌.. జస్ట్‌ మ్యారీడ్‌ .. అనే క్యాప్షన్‌తో వివాహం తర్వాత కశ్యప్‌తో ఉన్న ఫొటోలను సైనా తన ట్విటర్‌లో అభిమానులతో పంచుకుంది. డిసెంబర్ 16న వివాహ విందు ఏర్పాటు చేశారని తెలిసింది. ఆదివారం నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్న ఈ వివాహ విందుకు గవర్నర్‌ నరసింహన్‌ సహా పలువురు ప్రముఖులను ఇప్పటికే ఆహ్వానించారు. ముందు స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ.. తర్వాత ప్రేమలో పడ్డారు.గత కొంత కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇవాళ పెళ్లి చేసుకున్నారు.



Post a Comment

0 Comments