ADS

header ads

లోక్ సభలో ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం..

News Hunter : ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. లోక్ సభలో ఇవాళ కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టగా..పలువురు సభ్యులు బిల్లుపై చర్చ సందర్భంగా తమ వాదనలను వినిపించారు. అనంతరం ట్రిపుల్ తలాక్ బిల్లుపై పార్లమెంట్ లో ఓటింగ్ నిర్వహించారు. బిల్లుకు అనుకూలంగా 245 మంది సభ్యులు ఓటింగ్ వేయగా..వ్యతిరేకంగా 11 మంది ఓటింగ్ వేశారు. ఆ తర్వాత స్పీకర్ సుమిత్రా మహాజన్ బిల్లుకు ఆమోదం లభించిందని ప్రకటించారు. ఇదిలా ఉంటే ఓటింగ్ సమయంలో కాంగ్రెస్, అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి.