ADS

header ads

రహస్య కెమెరాలతో అమ్మాయిల కదలికలను చిత్రీకరించిన హాస్టల్ యజమాని

News Hunter : పోస్టుగ్రాడ్యుయేట్ అమ్మాయిల హాస్టల్లో నివాసముంటున్న ముగ్గురు అమ్మాయిల  కదలికలను రహస్య కెమెరాలతో చిత్రీకరించిన యజమాని బాగోతం ముంబయిలో వెలుగుచూసింది. దక్షిణ ముంబయిలోని అప్ మార్కెట్ లో నాలుగు పడకగదుల ఫ్లాట్ లో ముగ్గురు అమ్మాయిలు పేయింగ్ గెస్టులుగా నివాసముంటున్నారు. సాక్షాత్తూ హాస్టల్ యజమాని రహస్య కెమెరాను అమర్చి అమ్మాయిల కదలికలను తన మొబైల్ ఫోన్ తో రహస్యంగా వీడియోలు చిత్రీకరించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. అమ్మాయిలు గదిలో మాట్లాడుకునే మాటలను కూడా రికార్డు యజమాని రికార్డు చేశారు. ఓ అమ్మాయి కెమెరా ఉన్నఅడాప్టరుపై  వస్త్రం కప్పింది. అంతలో హాస్టల్ యజమాని తనిఖీ పేరిట గదిలోకి వచ్చి అడాప్టరుపై వస్త్రం ఎందుకు కప్పావని ప్రశ్నించారు. అడాప్టరు ద్వారా తమ కదలికలను రహస్యంగా చిత్రీకరించిన విషయం తెలిసిన అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో పోలీసులు రంగంలోకి దిగి అడాప్టరును స్వాధీనం చేసుకొని నిందితుడైన హాస్టల్ యజమానిని అరెస్టు చేశారు. ఏడాదిన్నర కాలంగా అమ్మాయిల సీసీటీవీ ఫుటేజ్ ను ఉంచిన యజమాని దాన్ని ఇతరులకు కూడా పంపించాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. హాస్టల్ యజమానిపై ఐటియాక్టు ప్రకారం కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశారు.