ADS

header ads

చిత్తూరులో రెండు లారీలు ఢీ : ఒకరు మృతి

News Hunter : చిత్తూరు జిల్లా పలమనేరు కుప్పం రహదారిలో సాకే గ్రామం వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా రెండు లారీలు ఢీకొనడంతో ముందు భాగం నుజ్జునుజ్జుకాగా....ఇద్దరు లారీ డ్రైవర్లు ఇరుక్కుపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జెసిబితో అక్కడున్న ప్రజల సహాయంతో మూడు గంటలు కష్టపడి రెండు లారీల డ్రైవర్‌ల (రమేష్‌, సాయి) ను బయటికి తీసి తర్వాత అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం పలమనేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే సాయి అనే లారీ డ్రైవర్ మృతి చెందాడు . కాగా AP16TK0549 లారీ డ్రైవర్ సాయి గుడివాడకు చెందిన వ్యక్తి.మరో లారీ నెంబర్ TN99A9138 డ్రైవర్ రమేష్ కోయంబత్తూర్‌కు చెందిన వారుగా గుర్తించారు.

Post a Comment

0 Comments