News Hunter : పెళ్లైన ప్రతి జంట పిల్లలను కోరుకుంటుంది. కొత్త జంట కొన్ని రోజులు బానే ఉన్నా సంవత్సరాలు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోతే ఆందోళన చెందుతారు. పిల్లలకోసం తిరగని హాస్పిటల్, మొక్కని దేవుడూ ఉండడు . భార్యాభర్తలకి అన్ని పరీక్షలు చేసి ఫలానా లోపం ఉందంటూ అది నివారించగలిగే సమస్య అయితే దానికోసం ట్రీట్‌మెంట్ తీసుకోమంటారు.
మరేదైనా నివారించలేని కారణమైతే పిల్లలు పుట్టడం కష్టమని చెబుతారు. ఇలాంటి కేసే ఒకటి.. డాలస్‌కి చెందిన నాడియా, రోబీ షెర్విన్‌కి కూడా పెళ్లై ఆరేళ్లయింది. తమకు పిల్లలు పుట్టలేదని తరచూ బాధ పడుతుండేవారు. వైద్యులని సంప్రదిస్తే PCOS సమస్య ఉందని, గర్భం దాల్చడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
దాదాపు సంవత్సర కాలం ట్రీట్‌మెంట్ తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఇంజెక్షన్ ద్వారా హార్మోన్ తీసుకోవాలన్న సలహాను ఆ దంపతులు పాటించారు. దాంతో ఇంజెక్షన్ చేసిన మొదటి నెలలోనే గర్భం దాల్చింది రోబీ షెర్విన్. నెలలు నిండిన తరువాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చింది.
కొంత కాలంగా పిల్లలు లేని వారికి ఇద్దరు బిడ్డలని చూసేసరికి సంతోషం అంబారన్నంటింది. ఏడాది సరదా సంతోషాల అనంతరం మరోసారి పిల్లలు కావాలనుకున్నారు. రెండో సారి కూడా హర్మోన్ ఇంజెక్షన్ తీసుకున్న షెర్విన్ మళ్లీ గర్భం దాల్చింది. ఈసారి కాన్పులో ముగ్గురు బిడ్డలను ప్రసవించింది. ఆరు సంవత్సరాలు బిడ్డలు లేరని బాధపడ్డ వారికి అయిదుగురు పిల్లలని చూసుకుని మురిసిపోతున్నారు ఆ దంపతులు .