News Hunter : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేటలో శుక్రవారం విషాదం నెలకొంది. కోళ్లఫారంలో పనిచేసే నలుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వీళ్లంతా 25 ఏళ్లలోపు ఉన్నవాళ్లే. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపూరం గ్రామానికి చెందిన సతీశ్ గౌడ్ (20), అరవింద్ గౌడ్ (23), మహేశ్ ముదిరాజ్ (23), మహేందర్ రెడ్డి (25) లుగా గుర్తించారు. వీరంతా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెంకటాపురం వాసులుగా సమాచారం. కోళ్లఫారం యజమాని సమాచారం మేరకు.. నలుగురు యువకులు గత నెల రోజులుగా కేజీఎల్ కోళ్లఫారంలో పని చేస్తున్నారు. వీరు బస చేయడానికి కోళ్లఫాం పక్కనే గదులు కేటాయించారు. యువకులు రాత్రి పొద్దుపోయే వరకు కోళ్లకు ఇంజక్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. కోళ్ల బరువు పెరగడానికి యజమానులు వాటికి స్టెరాయిడ్స్‌తో కూడిన ఇంజక్షన్లు వేయిస్తుంటారు. ఇంజక్షన్లు వేసిన అనంతరం యువకులు భోజనం చేసి నిద్రపోయినట్లుగా యజమాని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు.
