ADS

header ads

వాహనదారులకు ఊరట..తగ్గుతున్న పెట్రోల్ ధరలు..

News Hunter : నిన్నమొన్నటి వరకు వాహనదారుల్ని ఏడిపించిన పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. వరుసగా నాలుగు రోజుల నుంచి తగ్గుతున్న ధరలు.. మరింతగా తగ్గాయి. ఫలితంగా ఈ ఏడాదిలోనే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఢిల్లీలో పెట్రోలు ధర 7 పైసలు తగ్గి 69 రూపాయల 79 పైసలకు చేరగా.. డీజీల్‌ ధర 63 రూపాయల 83 పైసలగా ఉంది. ఇక ముంబైలోనూ 7 పైసలు తగ్గిన పెట్రోలు ధర 75 రూపాయల 41 పైసలు ఉండగా, డీజీల్‌ ధర 66 రూపాయల 79 పైసల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పతనం కావడంతో…పెట్రోలు ధరలు స్వల్పంగా తగ్గాయి. డీజిల్‌ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… హైదరాబాద్‌ లీటర్‌ పెట్రోలు ధర 7 పైసలు తగ్గి 74 రూపాయల 2 పైసల వద్ద, డీజీల్‌ ధర 69 రూపాయల 37 పైసల వద్ద కొనసాగుతోంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ ధర 8 పైసలు తగ్గి 73 రూపాయల 54 పైసలు ఉండగా.. డీజీల్‌ ధర 68 రూపాయల 54 పైసలు వద్ద స్థిరంగా ఉంది. ప్రస్తుతం డీజిల్‌ ధరల్లో ఎలాంటి మార్పులు లేనపప్పటికి రెండు మూడ్రోజుల్లనే ఇది కూడా తగ్గే సూచనలు కనిపిస్తునాయంటున్నారు మార్కెట్‌ నిపుణులు.