News Hunter : వస్తు సేవల పన్ను జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక టీవీ, రిఫ్రిజరేటర్, వాషింగ్‌మెషీన్ వంటి ఉత్పత్తుల ధరలు తగ్గాయని ఆర్థికశాఖ నివేదిక పేర్కొంది. గతంలో వీటిపై 31 శాతం పన్ను అమలైతే, జీఎస్‌టీలో 18 శాతమే పడుతుండటం ఇందుకు కారణమని తెలిపింది. ఎయిర్ కండిషనర్లు, వాహనాలపైనా పన్నురేట్లు తగ్గాయని వివరించింది. ప్రస్తుతం 34 రకాల విలాస వస్తువులు మాత్రమే 28 శాతం పన్నురేటులో ఉన్నాయని పేర్కొంది. వాస్తవానికి 2017 జులై1 నుంచి జీఎస్‌టీ అమల్లోకి వచ్చాక, వీటిపై అమలవుతున్న పన్నురేటు కూడా గతంకంటే తగ్గిందని వివరించింది. దేశం అంతటా ఒకే పన్నురేటు విధించడం ద్వారా ఒకే మార్కెట్‌గా తీర్చిదిద్దడమే కాక, పన్నుపై పన్ను విధించే విధానానికి స్వస్తి పలకడం కూడా జీఎస్‌టీ అమలు ఉద్దేశమని స్పష్టం చేసింది.
